జిల్లా వైద్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

03-10-2026 | 07:38pm

ఆమనగల్లు ఆసుపత్రిలో జిల్లా వైద్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

​ఆమనగల్లు,(విజయక్రాంతి): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ(Minister Dr. Damodara Raja Narasimha), కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy)ల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డా. స్వర్ణ కుమారి శనివారం ఆమనగల్లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.​ ఈ సందర్భంగా ఆసుపత్రిలోని హాజరు పట్టికలు, రోగుల రికార్డులు, మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు.

వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, పాము, కుక్క కాటు వ్యాక్సిన్లను తగినంత నిల్వ ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ​అనంతరం నిర్మాణంలో ఉన్న నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన పనులను పరిశీలించిన డి ఎం అండ్ హెచ్ ఓ , మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి రాబోయే రెండు నెలల్లో భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్లు డా. మైమున, డా. ఊర్మిళ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు