ప్రశాంతంగా ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ పాండు
పటాన్ చెరు, అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana State Public Service Commission) ఆధ్వర్యంలో అసిస్టెంట్ సైంటిస్ట్(Assistant Scientist) (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష(Computer-based test) ప్రశాంతంగా ముగిసింది. పటాన్చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో(GITAM University) ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పాండు తనిఖీ చేశారు. అభ్యర్థుల హాజరు, బయోమెట్రిక్ నమోదు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
పరీక్షలు నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మొత్తం 150 మంది అభ్యర్థులకు గాను 89 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.