పదో తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్లు పంపిణీ
ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్
నారాయణఖేడ్,నవంబర్ 2: నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జెడ్పీజీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో(Government ZPGHS Urdu Medium School) సోమవారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో సాలారే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా పదో తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ ఎస్ఎస్సీ మోడల్ టెస్ట్ పేపర్లను ఎంఐఎం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, కర్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొహియుద్దీన్, నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మొహీద్ పటేల్‌తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. యాదవ రెడ్డి, ఎస్.ఏ. మనన్, మొహమ్మద్ పాషా మియా, ఎంఐఎం నాయకులు షేక్ అమ్జద్, ముజీబ్ ఖాన్, హబీబ్ అబ్దుల్లా, షేక్ ఫయాజ్, అహద్ పటేల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.