ఇందిరమ్మ కమిటీల తీరుపై సర్పంచుల ఆగ్రహం
బిజినేపల్లి: ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Housing) కమిటీకి చైర్మనుగా ఉన్న సర్పంచులను ఆ కమిటీ సభ్యులు, అధికారులు నీర్లక్ష్యం చేస్తున్నారని సోమవారం ఆయా గ్రామాల సర్పంచులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కమిటీలకు చైర్మన్లుగా ఉన్న తమకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, తమ ప్రమేయం లేకుండానే కమిటీ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని పిర్యాదులో పేర్కొన్నారు.
గ్రామాల్లో ఎవరికి ఇళ్లు వచ్చింది, ఎవరికి రాలేదు అనే కనీస సమాచారం కూడా తమకు లేదని, దీని వల్ల ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో సర్పంచులను కూడా భాగస్వాములను చేయాలని, తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రజావాణి పిర్యాదులో సర్పంచులు బోనాసి రామకృష్ణ, బి.నరసింహ రెడ్డి, ఎన్.నాగిరెడ్డి, డి.ప్రణీత, అంజయ్య, శంకర్, తదితరులు ఉన్నారు.