కడ్పాల్ జెడ్‌పీహెచ్ఎస్ విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Kadpal ZPHS) విద్యార్థులకు అప్తాలిమిక్ ఆఫీసర్ లక్ష్మినారాయణ ప్రధానోపాధ్యాయులు వెంకటేశం ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు(eyeglasses ) అందజేశారు. విద్యార్థుల కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైద్య సిబ్బంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలను అందించారు. విద్యార్థులు చిన్న వయస్సులోనే కంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స పొందాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చదువులో ఇబ్బందులు తగ్గడంతో పాటు కంటి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.