బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం
- మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాట్ల పరిశీలన
- చెరువులు, ఘాట్ల వద్ద ముమ్మర చర్యలు
- మున్సిపల్ కమిషనర్ దశరథ్ కుమార్
గుమ్మడిదల అక్టోబర్ 17 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేశామని మున్సిపల్ కమిషనర్ దశరథ్ కుమార్(Municipal Commissioner Dasharath Kumar) తెలిపారు.గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు, అన్నారం,వీరన్నగూడెం గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంగణాలు, నిమజ్జనం చేసే చెరువు ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆయా గ్రామాల్లో చెరువుల వద్ద నిమజ్జన ఘాట్ల ఏర్పాట్లు, లైటింగ్, పరిశుభ్రత పనులను సమీక్షించారు.
బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఏర్పాట్లలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి చేశారని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కమిషనర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనారు.