దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
17-10-2026 | 10:58pm
హుజురాబాద్,అక్టోబర్ 17: (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, కొత్తపల్లిలో కొలువుదీరిన శ్రీ దుర్గామాత అమ్మవారిని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి పాల్గొన్నారు.