అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలి!
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మహబూబ్ నగర్ జిల్లా
గండీడ్, అక్టోబర్ 17: విజయక్రాంతి : మండల పరిధిలోని కొమిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో(Komireddipalli Gram Panchayat Office) స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని(Smart ration card distribution program) నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత ఆంజనేయులు.వార్డు సభ్యులు.సీనయ్య, తిరుమలయ్య,చంద్రయ్య,జి.బాలకృష్ణయ్య, ఎం.వెంకటయ్య, డీజే రాము,మక్సుద్, టైగర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు,లబ్ధిదారులు హాజరై స్మార్ట్ రేషన్ కార్డులను అందుకున్నారు.