అక్రమ నిర్మాణాలపై స్పందనేంటి?

17-10-2026 | 07:14pm

* శంషాబాద్‌ కొత్త టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మనోహర్ కు సవాల్

* వనపర్తి నుంచి శంషాబాద్ కు బదిలీ

శంషాబాద్‌, అక్టోబర్ 17(విజయక్రాంతి): నానాటికి నగర జనాభా(Population) పెరుగుతున్నది.. పెరుగుతున్న జనాభాకు తగినట్టు నగరం కూడా విస్తరిస్తున్నది. ఈ క్రమంలో శివారు ప్రాంత భూములకు(Lands) మంచి డిమాండ్ వచ్చింది. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో శంషాబాద్‌ ప్రాంతంలోనూ(Shamshabad area) అక్రమ నిర్మాణాలు(Illegal constructions) పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నూతనంగా టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన మనోహర్‌.. ఈ అనుమతులు లేని నిర్మాణాలపై ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. వనపర్తి జిల్లా(Wanaparthy District) నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు ఈ వ్యవహారాల పరిశీలన కీలకంగా మారనుంది. మధుర నగర్‌, ఆర్‌బీ నగర్‌, బృందావన్‌ నగర్‌ కాలనీల్లో నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలతో పాటు జీఓ నంబర్ 111 పరిధిలోని నిర్మాణాల అనుమతులను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వనపర్తి జిల్లా నుంచి శంషాబాద్ మున్సిపాలిటీ కి బదిలీపై వచ్చిన కొత్త అధికారి.. నిర్మాణ అనుమతుల పరిశీలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు