ఎడ్లరెగడి తాండలో జగదాంబ జాతర

13-10-2026 | 07:52pm
  1. మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక సంబరాలు
  2. ఖేల్‌..కుద్‌ పోటీలతో లంబాడీల సందడి

కంగ్టి,అక్టోబర్ 13(విజయక్రాంతి): మండలంలోని ఎడ్లరెగడి తాండలో జ్వాలాముఖి(Jwalamukhi at Edlaregadi Thanda) (జగదాంబ) మాత కాళుబాబా,రాంసింగ్ బాబా,మాన్‌సింగ్ మహారాజ్‌ల జాతరను మథురా (లబానా) లంబాడీలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు.

సంప్రదాయ కళలకు ప్రాధాన్యం నిజామాబాద్‌,కామారెడ్డి,ఆదిలాబాద్‌,సంగారెడ్డి జిల్లాలకు చెందిన మథురా లంబాడీలు జాతరలో పాల్గొన్నారు.తమ సంప్రదాయ నృత్యమైన ఖేల్‌–కుద్‌ బృందాలను ఎంపిక చేసి పోటీలు నిర్వహించారు.లంబాడీల సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మూడు రోజులూ అన్నదానం

జాతర సందర్భంగా భక్తులకు మూడు రోజుల పాటు నిత్యం అన్నదాన మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.ఆలయ పీఠాధిపతి మంగళచంద్ మహారాజ్‌,పూజారి జోహార్ సింగ్ మహారాజ్‌ ఆధ్వర్యంలో తాండవాసులు జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు.జాతరతో ఎడ్లరెగడి తాండలో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు