రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని వ్యక్తి మృతి
రామచంద్రపురం అక్టోబర్ 23: రామచంద్రపురం మండలం(Ramachandrapuram Mandal) తెల్లాపూర్‌లోని ఎలియన్స్ స్పేస్ స్టేషన్(Aliens Space Station) ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో 23-10-2026 తేదీన సాయంత్రం 17:00 గంటల నుండి 17:15 గంటల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.ప్రాథమిక వివరాల ప్రకారం, సదరు వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, తెల్లాపూర్ నుంచి ఉస్మాన్‌నగర్ వైపు వెళ్తున్న రెడీ మిక్స్ ప్లాంట్‌కు చెందిన లారీ (నంబర్: KA 01 AM 4240) డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనాన్ని నడిపి వెనుక నుంచి సదరు వ్యక్తిని ఢీకొట్టాడు.
అనంతరం లారీ అతని మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.మృతుడి పేరు, చిరునామా తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే, కొల్లూరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.