రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
ప్రమాద ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్
పటాన్ చెరు, అక్టోబర్ 23 : సంగారెడ్డి జిల్లాలో(Sangareddy District) రోడ్డు ప్రమాదాలు, మరణాలను(Road accidents and deaths) తగ్గించి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prateek Jain) అధికారులను ఆదేశించారు. ప్రమాద రహిత జిల్లా కార్యక్రమంలో భాగంగా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి జాతీయ రహదారి(National Highway) 65పై పటాన్చెరు నుంచి దిగ్వాల్ కూడలి వరకు ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు.
ప్రమాద ప్రాంతాల్లో విద్యుద్దీపాలు, హెచ్చరిక బోర్డులు(Warning signs), వేగ నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాదచారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.