మైలార్ గూడెంలో వరి ధాన్యం కొనుగోలు

23-10-2026 | 08:19pm

కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.....

యాదగిరిగుట్ట, అక్టోబర్ 23 (విజయక్రాంతి):  యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం గ్రామంలో(Mailar Gudem Village) పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, డైరెక్టర్లు, అధికారులు,  రైతులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు