కలుషిత నీటి సమస్యపై జలమండలి ఈడీ క్షేత్రస్థాయి పరిశీలన
సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
పటాన్చెరు/రామచంద్రపురం అక్టోబర్ 26: భారతీనగర్ డివిజన్లోని బాంబే కాలనీలో వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందన్న ఫిర్యాదులపై జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్(Water Board Executive Director Santosh) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పటాన్చెరు బీఆర్ఎస్ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డితో కలిసి కాలనీని సందర్శించారు.
పరిశీలనలో బీడీఎల్ అపార్ట్మెంట్ వద్ద డ్రైనేజీ నీరు తాగునీటి పైప్లైన్లో కలుస్తున్నట్లు గుర్తించారు. అలాగే పాత రామచంద్రాపురంలో నీటి మరమ్మతు పనులు, వాసవి నగర్లో యూజీడీ సమస్యలను పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.