ఆసుపత్రికి తాళం.. వైద్య సేవలకు బ్రేక్‌!

24-10-2026 | 09:49am

ఉదయం 9.30 అయినా తెరుచుకోని పీహెచ్‌సీ!

రోగులకు అత్యవసర వైద్యం ఎలా

బెజ్జంకి,అక్టోబర్ 24 : ప్రజలకు నిరంతరం వైద్య సేవలు(Medical Services) అందించాల్సిన బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో(Bejjamki PHC Closed) సరైన సమయపాలన లేక రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు.శనివారం ఉదయం 9.30 గంటల సమయం కావస్తున్నా పిహెచ్సి కి మాత్రం తాళం వేసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. కనీసం అటెండర్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో వైద్యం కోసం వచ్చే రోగులు తిరిగి వెనుదిరగలిసిన పరిస్థిది నెలకొంది. 24గంటలు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి ఇలా తాళం వేసి ఉండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సిబ్బంది కొరత ఉండడం..అలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి ప్రారంభ వేళల్లోనే అందుబాటులో లేకపోతే అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై వివరణ కోరేందుకు వైద్యాధికారి నీ  ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.ఆసుపత్రిలో సిబ్బంది కొరతను పరిష్కరించడంతో పాటు,వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు