బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ చేర్చాలి
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 24 : కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నిర్వహించే జనగణనలో బీసీ కులగణన(BC census) కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్(Bahujan Left Front) (బీఎల్ఎఫ్), బీఎల్పీ పార్టీల ఉమ్మడి మెదక్ జిల్లా(Medak District) ఉపాధ్యక్షుడు కోటగిరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల(Congressional elections) సందర్భంగా ప్రకటించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 23 నుంచి నవంబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కోటగిరి ఆంజనేయులు, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్ మాట్లాడారు. దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులాలవారీగా జనాభా లెక్కలతో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు సత్తయ్య, శ్రీనివాస్, ప్రభురాజ్ గంగపుత్ర, శ్రావణ్ కుమార్, కుమార్, రవికుమార్, రాజు, శంకర్, పుష్ప, రత్నయ్య చారి పాల్గొన్నారు.