తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్‌ది చెరగని ముద్ర
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, అక్టోబర్ 11 : తెలంగాణ రాష్ట్ర సాధన(Achievement of Telangana State) నుంచి అభివృద్ధి, సంక్షేమం(Development and Welfare) వరకు కేసీఆర్(KCR) చెరగని ముద్ర వేశారని గజ్వేల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి(Vanteru Pratap Reddy) అన్నారు. సిద్దిపేట జిల్లా దశాబ్ది వేడుకల సందర్భంగా గజ్వేల్‌లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను చేరువ చేశారని ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్లు, వైద్య కళాశాలలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ఆయన ఘనతేనన్నారు.
కాళేశ్వరం, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టులతో సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్‌తో ప్రజలకు మేలు చేశారని కొనియాడారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లతో పేదలకు అండగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణకు చెప్పుకోదగిన అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.