బందారంలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోత

23-10-2026 | 06:46pm

కొండపాక, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కొండపాక మండలం బందారం గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారు జనగామ స్వప్న–కనకయ్య ఇంటి నిర్మాణానికి సర్పంచ్ కొలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో ముగ్గు పోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ పథకం లక్ష్యమన్నారు. ఇల్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి,మాకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి రాజమణి, ఉప సర్పంచ్ కట్ట నవీన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు