శ్రీ మహాలక్ష్మి దేవి స్వరూపంలో అమ్మవారు
కొండపాక,అక్టోబరు 17 ( విజయక్రాంతి ): కొండపాక మండలం(Kondapaka Mandal) మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో(Shrine of Lord Mallikarjuna) శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు మహాలక్ష్మి స్వరూపిణిగా విజయదుర్గ భక్తులకు(devotees) దర్శనమిచ్చింది. క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా భక్తులు వందలాదిగా పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నప్రసద వితరణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.