'డ్రంక్ అండ్ డ్రైవ్'లో 9 మందికి జైలు

06-11-2026 | 08:09pm

60 మందికి రూ.5.78 లక్షల ఫైన్

సిద్దిపేట క్రైం, నవంబర్ 6: సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటీవల వాహనాలు తనిఖీ చేయగా 60 మంది వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు(Traffic CI Muthyamraju) తెలిపారు. గత అయిదు రోజులుగా వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు. న్యాయమూర్తి విచారణ చేసి ఒకరికి 10 రోజులు, ఆరుగురికి 3 రోజులు, ఇద్దరికి 2 రోజులు జైలు శిక్ష,  మొత్తంగా రూ. 5లక్షల 78వేల జరిమానా విధించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 20 మందికి కలిపి రూ.లక్ష జరిమానా విధించారని సీఐ ముత్యంరాజు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు