అనుమతి లేకుండా డీజేలు నిర్వహిస్తే కేసులు
త్రీ టౌన్ సిఐ టి. లక్ష్మీబాబు హెచ్చరిక
కొండపాక , అక్టోబర్ 23 (విజయక్రాంతి): పోలీసుల అనుమతి(Police permission) లేకుండా డీజేలు(DJs) నిర్వహిస్తే చట్టప్రకారం కేసులు నమోదు(Registration of cases) చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట త్రి టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు(Siddipet Three Town Inspector T. Lakshmibabu) హెచ్చరించారు. ఇప్పటికే అనుమతులు లేకుండా డీజేలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, శాంతిభద్రతలకు(Law and order) విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డీజే నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ కోరారు.