కాంగ్రెస్‌కు అభ్యర్థి కరువు..?

27-11-2026 | 05:00am
  1. సిద్దిపేటలో హరీశ్‌కు ఎదురెళ్లేదెవరు..?
  2. మంత్రి పదవి ఆశ చూపిన సీఎం.. 
  3. వర్గపోరుతో సతమతమవుతున్న హస్తం పార్టీ!
  4. బీఆర్‌ఎస్‌కు కంచుకోట.. బీజేపీకి రాజకీయ అస్త్రాలు.. 
  5. త్రిముఖ పోరుపై ఆసక్తికర చర్చ!

సిద్దిపేట, నవంబర్ 26 (విజయక్రాంతి): సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం(Siddipet Assembly Constituency)లో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయి? బీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలుకొట్టేందుకు కాంగ్రెస్కు సరైన అభ్యర్థి ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మంత్రి పదవి హామీని అందుకునే నాయకుడెవరు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్టాపిక్గా మారింది. ఇటీవల సిద్దిపేట పర్యటనలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం ప్రకటిం చడంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

అభ్యర్థి కంటే ముందే వర్గపోరు.!

సిద్దిపేట కాంగ్రెస్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి ప్రధాన ప్రతిబంధకంగా మారుతోందన్న వి మర్శలున్నాయి. సీనియర్లు, జూనియర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జి వర్గాలు గా విడిపోయిన నాయకత్వం కార్యకర్తలను ఏకతాటిపై కి తీసుకురావడంలో విఫలమవుతోందనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సీఎం సభ సందర్భంగా కూడా ఫ్లెక్సీల వివా దం తెరపైకి రావడం అంతర్గత విభేదాలకు అద్దం పట్టింది. రెండున్నర దశాబ్దాల తర్వాత భారీ సభ నిర్వహించామన్న ఉత్సాహం ఉన్నా, ఆ జనసమీకరణ ఓట్లుగా మారుతుందా అనేదే అసలు ప్రశ్న. 

హరీశ్‌కు ఎదురెళ్లడం అంత సులువా..?

2004 నుంచి సిద్దిపేట రాజకీయాల్లో తిరుగులేని పట్టును కొనసాగిస్తున్న హరీశ్రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, బీఆర్‌ఎస్లో కీలక నాయకుడు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, వ్యక్తిగత రాజకీ య పరిచయాలు ఆయనకు బలంగా ఉన్నా యి. మరోవైపు నిలిచిపోయిన అభివృద్ధి పనులు, రద్దయిన ప్రాజెక్టులు, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్పు ఆయన నిరం తరం రాజకీయ దాడి చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డినే సిద్దిపేట నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ చేయడం రాజకీయ వేడిని పెంచింది.

బీజేపీ బలమెంత, వ్యూహమెంత..?

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోరులో బీజే పీ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. 22ఏ భూముల వివాదం, రైతుల సమస్యలు, స్థానిక అంశాలను అస్త్రాలుగా చేసుకుంటోంది. జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ బలం ఓట్లుగా మా రుతుందా? బలమైన స్థానిక నాయకత్వాన్ని నిర్మించుకుంటుందా? అన్నది చూడాలి.

గెలుపు గుర్రం ఎవరు..?

మొత్తంగా సిద్దిపేటలో బీఆర్‌ఎస్కు నా యకత్వ బలం, కాంగ్రెస్కు అధికార బలం, బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ అస్త్రాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్కు ముందున్న అసలు సవాల్ హరీశ్రావును ఓడించడం కంటే ముందుగా సొంత పార్టీలో ఐక్యత సాధించడం. సీఎం హామీతో మంత్రి పదవి వస్తుందని ఆశించడం వేరు, ప్రజల్లో గెలుపు విశ్వాసం కల్పించడం వేరు, సరైన అభ్యర్థి, సమన్వయ నాయకత్వం, బలమైన కేడర్ లేకుండా అధికార పార్టీ అండ ఒక్కటే విజయాన్ని అందించగలదా? సిద్దిపేట రాజకీ య చదరంగంలో విజయం ఎవరిదో కాలమే నిర్ణయించాలి!

మరిన్ని వార్తలు