విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి..

21-09-2026 | 08:51pm

ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ బండకాడి గణేష్..

సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 21: విద్యార్థులు చిన్ననాటి నుంచే సరైన లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడాలని ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ (Ashrita Voluntary Organization)జిల్లా కోఆర్డినేటర్ బండకాడి గణేష్ అన్నారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండి, విద్యపై దృష్టి సారించాలని సూచించారు.

పుల్లూరు బండపై త్రికోటేశ్వర ఆలయంలో సోమవారం బాల్య వివాహాల నిర్మూలన చట్టంపై భక్తులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, స్మార్ట్‌ఫోన్, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని గణేష్ తెలిపారు. బాల్య వివాహం గురించి తెలిసిన వారు చైల్డ్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంచం లత, వ్యాగ్రపురి హెరిటేజ్ ట్రస్ట్ చైర్మన్ దేశెట్టి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరి, ఉపాధ్యాయులు, ఆశ్రిత సంస్థ ప్రతినిధులు, గ్రామస్థులు, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు