విద్యార్థులకు ప్రభుత్వ శాఖలపై అవగాహన
గజ్వేల్, అక్టోబర్ 3 : గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని(Gajwel-Pragnapur) సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్(St. Mary's Vidyaniketan High School) సీబీఎస్‌ఈ విద్యార్థులు ప్రభుత్వ శాఖల(Government departments) పనితీరుపై అవగాహన కోసం వివిధ కార్యాలయాలను సందర్శించారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం(Gajwel Municipal Office), పోలీస్‌స్టేషన్(Police station), అర్బన్ పార్క్‌ను(Urban Park) సందర్శించారు.
మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మున్సిపల్ కార్యకలాపాలను విద్యార్థులకు వివరించారు. టౌన్ సీఐ రవికుమార్ పోలీస్ శాఖ విధులు, చట్టాలపై అవగాహన కల్పించారు. గజ్వేల్ అటవీ శాఖ సెక్షన్ అధికారి పవన్ పార్కులోని విశేషాలను వివరించారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్న సేవలు, రక్షణ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కలిగిందని పాఠశాల ప్రతినిధులు తెలిపారు.