ఆర్టీసీ కార్మికులను అవమానించిన సిద్దిపేట డీఎం

06-11-2026 | 10:09pm

డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలి.. 

టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి డిమాండ్

కోహెడ, నవంబర్ 6 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను(RTC workers) కింద కూర్చోబెట్టి అవమానించిన సిద్దిపేట డిపో మేనేజర్‌ పై చర్యలు తీసుకోవాలని టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి(TMU State Joint Secretary MP Reddy) డిమాండ్ చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌లో(Husnabad) ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కార్మికులను గౌరవంగా చూడాల్సిన అధికారి వారిని కింద కూర్చోబెట్టడం అవమానకరమని అన్నారు. ఈ ఘటన కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సిద్దిపేట డిపో మేనేజర్‌ను వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కార్మికుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోకపోతే టీఎంయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కేస్ రెడ్డి, యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు