పశువుల నీటితొట్టె నిర్మాణానికి ముగ్గు

29-10-2026 | 08:03pm

కోహెడ,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(impact of El Niño) నేపథ్యంలో పశువుల సంరక్షణకు, అవసరమైన నీటి సదుపాయం కల్పించేందుకు నీటితోట్టెను(Water Trough) రోడ్డు పక్క నిర్మాణం చేసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముగ్గు పోశారు.

రాష్ట్ర మంత్రులు సీతక్క,  పొన్నం ప్రభాకర్‌ సూచనలతో హుస్నాబాద్‌ మండలం తోటపల్లి గ్రామంలో పశువుల నీటితొట్టె నిర్మాణానికి ముగ్గు పోషినట్లు వారు పేర్కొన్నారు. నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టు దారున్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బంక చందు, మండల అభివృద్ధి అధికారి సురేశ్‌, ఏపీవో పద్మ, పరశురాం, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు