ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి నీళ్లు

27-09-2026 | 05:25am
  1. రంగనాయక సాగర్ నుంచి విడుదల చేసిన మంత్రి తుమ్మల 
  2. తెలంగాణకు మణిహారంగా నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 
  3. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నంగునూరు, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మం డలం నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నీటి సమస్యపై విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. వ్యవసాయ శా ఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) శనివారం నర్మెట ఫ్యాక్టరీని సందర్శించారు. కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడి యాతో మాట్లాడారు. 

తెలంగాణకు నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మణిహారమని, రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి అయినా పంట ను ఒకే రోజులో తీసుకొచ్చి ప్రాసెస్ చేసే అవకాశం ఉందని తెలిపారు.  ఇది అతిపెద్ద ఫ్యాక్టరీ అని ఆయన తెలిపారు. ప్రతి 10,000 ఎకరాలకు ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామ ని, త్వరలోనే అన్ని జిల్లా ల్లో ఆయిల్ఫెడ్తో పాటు ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్, సో యా, సన్‌ఫ్లవర్ నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని (ఇంపోర్ట్ డ్యూటీ) తగ్గించడం దేశీయ రైతుల గొంతు కోయడమేన న్నారు. గతంలో దిగుమతి సుంకం సున్నాకి తగ్గడంతో రైతులు నష్టపోయారని గుర్తుచేశారు.

తాము అధికారంలోకి వచ్చాక టన్ను  రూ.12,000 నుండి రూ.25,000కి పెంచామని తెలిపారు. ఇటీవల మళ్ళీ సుంకం త గ్గించడంతో ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు లేఖలు రాసినట్లు  తెలిపారు. కనీసమద్ద తు ధర (ఎంజీపీ) ప్రకటించి,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాం త్, ఇన్చార్జి ప్రనిష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు