మనీషా భన్వాలా పసిడి పట్టు

31-10-2026 | 05:00am

చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్ 

అస్తానా, అక్టోబర్ 30: కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత యువ మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా(Indian wrestler Manisha Bhanwala) చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత రెజ్లర్ మనీషా భన్వాలా 59 కేజీల విభాగంలో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించింది.

దీనితో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్ల ర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. 2010లో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ రెజ్లర్ మనీషా మాత్రమే. అమెరికాకు చెందిన అబిగల్ నెట్టెపై 8-6 తేడాతో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆరంభంలో 0- తో వెనుక బడినప్పటికీ, అద్భుతమైన స్థైర్యంతో పుంజుకుని 8 తేడాతో విజయం సాధించింది.

హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ ప్రాంతానికి చెందిన ఆమె 2022లో ఆమె ఆసియా ఛాంపియన్‌షిప్‌కు బయలుదేరే కొన్ని గంటల ముందే తన తండ్రిని కోల్పోయింది. అయినప్పటికీ ఆమె మొక్కవోని దీక్షతో క్రీడల్లో రాణించింది. కాగా మహిళల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మొత్తం 4 పతకాలు సాధించారు. నీలమ్ సిరోహి 50 కేజీల విభాగంలో ఫైనల్లో జపాన్ స్టార్ రెజ్లర్ యుయి సుసాకి చేతిలో ఓడి రజత పతకం సాధించింది. కాజ ల్ ఢోచక్ (76 కేజీలు) ఫైనల్స్ వరకు దూసుకెళ్లి రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే తను శర్మ (72 కేజీలు) కాంస్య పతక పోరులో అమెరికా రెజ్లర్‌ను ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది.

మరిన్ని వార్తలు