శీతల్‌దేవికి హ్యూందాయ్ బంపర్ గిఫ్ట్
గురుగ్రామ్, నవంబర్ 25 : సంకల్పానికి వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారా ఆర్చరీలో సంచలనాలు సృష్టించిన శీతల్‌దేవి(Para Archer Sheetal Devi)ని ప్రముఖ కార్ల కంపెనీ హ్యూందాయ్ ఘనంగా సత్కరించింది. ఆమె సాధించిన ఘనతలకు నజరానాగా బేయాన్ ఎస్‌యూవీ కారును బహుకరించింది. గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో శీతల్‌కు హ్యూందాయ్ మోటార్ ఇండియా ప్రతినిధులు కారును అందజేశారు. రెండు నెలల క్రితమే తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా శీతల్‌దేవిని హ్యూందాయ్ నియమించింది.
ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ ఆర్చర్‌గా కొనసాగుతున్న శీతల్‌దేవి పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు గెలిచింది. పారాలింపిక్స్‌లో పతకంతో పాటు ఆసియా పారాగేమ్స్‌లో ఏకంగా ఆరు పతకాలను కైవసం చేసుకుంది. ఇటీవల ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలతో పాటు రజతం గెలిచింది. పిన్న వయసులోనే అర్జున అవార్డుకు సైతం ఎంపికైంది. 2023 నుంచి సమర్థ్ కార్యక్రమం ద్వారా ఆమెకు అండగా నిలుస్తోన్న హ్యూందాయ్ సంస్థ ఈ విజయాలు దేశానికే ఎంతో గర్వకారణమని ప్రశంసించింది. తనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ నమ్మకముంచిన హ్యూందాయ్ కంపెనీకి శీతల్‌దేవి కృతజ్ఞతలు తెలిపింది.