విండీస్‌దే చివరి వన్డే

04-10-2026 | 05:25am

భారత్ చేతిలో క్లీన్‌స్వీప్ పరాభవం నుంచి విండీస్ తృటిలో తప్పించుకుంది. చివరి వన్డేలో ఆ జట్టు కెప్టెన్ షై హోప్(162 నాటౌట్)(captain Shai Hope ) వీరోచిత సెంచరీతో భారీ లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఈ టూర్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అంతకుముందు భారత బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ తృటిలో శతకాన్ని చేజార్చుకోగా, కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 

  1. షై హోప్ వీరోచిత ఇన్నింగ్స్
  2. 2 సిరీస్ భారత్ కైవసం
  3. కేఎల్ రాహుల్ సెంచరీ
  4. రోహిత్ శర్మ మెరుపులు

న్యూఛండీఘర్, అక్టోబర్ 3 : చివరి వన్డే కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగాయి. నితీశ్ రెడ్డి జట్టులోకి రాగా, అన్షుల్ కాంబోజ్ వన్డే అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీఇండియాకు ఆరంభంలోనే భారీ షాకులు తగిలాయి. వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ఒకే ఓవర్లో వ రుస బంతుల్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ (1), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0)లను అవుట్ చే యడంతో భారత్ 4 పరుగులకే 2 వికెట్లు కో ల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

ఈ దశలో రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ (55) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ తొలి పవర్ ప్లేలో 2 వికెట్లకు 28 పరుగులే చేసింది. పవర్ ప్లే అనంతరం రోహిత్ శర్మ దూకుగా ఆడాడు. ఈ క్రమంలో 58 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా బ్యాట్ ఝులిపించడం తో భారత్ 19.5 ఓవర్లలో 100 పరుగులు చేసింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రోహిత్(92) పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ కాగా, రుతురాజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇ న్నింగ్స్ ఆడాడు. క్లాస్ బ్యాటింగ్‌కు మారుపేరైన రాహుల్ మిడిల్ విండీస్ బౌలర్లపై విరు చుకుపడ్డాడు. 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా వన్డేల్లో అతనికిది 9వ శతకం. మొత్తం 87 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ 350 మార్కును దాటడంలో కీలక పాత్ర పోషించాడు.

అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. ఇదిలా ఉంటే చివర్లో నమన్ ధీర్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అటు అన్షుల్ కాంబోజ్ 2 భారీ సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ 50 ఓవ ర్లలో 7 వికెట్లకు 351 పరుగులు చేసింది. విం డీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టాడు. భారీ లక్ష్యఛేదనలో మరోసారి వెస్టిం డీస్ అద్భుతంగా ఆడింది. గత మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన ఉత్సాహంతో ఈ సారి కూడా దూకుడుగానే బ్యాటింగ్ కొనసాగించింది.

కెప్టెన్ షై హోప్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించాడు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (10) త్వరగానే అవుట్ అ యినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన అమీర్ జంగూ (67)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్లో కేమో పాల్ (44) మె రుపు బ్యాటింగ్‌తో కెప్టెన్కు మంచి సహకారం అందించాడు.

సిరాజ్ పర్వాలేదనిపిం చినా మిగిలిన బౌలర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. అన్షుల్ కాంబోజ్, నితీశ్ రెడ్డి, గుర్నూర్ బ్రార్ నిరాశపరిచారు. స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి పవర్ ప్లేలో సర్కిల్ అవతల నలుగురు ఫీల్డర్లతోనే ఫీల్డింగ్ చే యాల్సి రావడం కూడా భారత్ ఓటమికి కారణమైంది. విండీస్ 48.2 ఓవర్లలోనే 352 పరుగుల టార్గెట్‌ను అందుకుంది. తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా 2 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 351/7 ( కెఎల్ రాహుల్ 129 నాటౌట్, రోహిత్ శర్మ 92 , రుతురాజ్ 57 ; జేడన్ సీల్స్ 3/62, కీమో పాల్ 2/71)

వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 352/5 ( షై హోప్ 162 నాటౌట్, జంగూ 67, కీమో పాల్ 44 ; సిరాజ్ 1/52, నమన్ ధీర్ 1/33 )

మరిన్ని వార్తలు