క్వార్టర్స్‌లో ఉన్నతి, తన్వీ శర్మ
డబుల్స్‌లో గాయత్రి మందంజ
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్
లక్నో, నవంబర్ 26: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ(Syed Modi International Badminton Tournament)లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. ప్రీ క్వార్టర్స్‌లో తన్వీ శర్మ ఇండోనేషియాకు చెందిన ముతియారాపై 18 21 21- తేడాతో విజయం సాధించింది. అలాగే మరో క్రీడాకారిణి ఉన్నతి హుడా అమెరికా షట్లర్ ఇషికాపై 21 21 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ చేరింది. తస్నీమ్ మీర్ (Tasnim Mir): ఆరో సీడ్ కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) పై 21-19, 21-15 తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. అన్మోల్ ఖర్బ్ (Anmol Kharb): తోటి భారత క్రీడాకారిణి అశ్మిత చలిహాను 21-16, 21-15 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో తుషార్ సువీర్ తోటి భారత ఆటగాడు శాశ్వత్ దలాల్‌ను 21- 21 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరిన ఏకైక భారత ఆటగాడిగా నిలిచాడు. మలేషియా స్టార్ మరియు రెండో సీడ్ లీ జియా 21- 21 తేడాతో భారత ఆటగాడు ప్రణయ్ శెట్టిగర్‌ను ఓడించాడు. అటు మహిళల డబుల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రీసా జాలీ గాయత్రీ గోపీచంద్ ముందంజ వేశారు. ఏకపక్షంగా సాగిన ప్రీక్వార్టర్స్ పోరులో గాయత్రి జోడీ 21 స్కోరుతో శ్రేయా బాలాజీ, ప్రణవ్ నటరాజన్ జంటపై గెలుపొందింది. అయితే మిక్సిడ్ డబుల్స్‌లో మాత్రం సంచలనం నమోదైంది. టాప్ సీడ్ ధ్రువ్ కపిల తనీషా క్రాస్టో జంట మలేషియా జోడీ చేతిలో 22- 21 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.