కిట్స్ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు
చైర్మన్ నీలా సత్యనారాయణ
కోదాడ(విజయక్రాంతి): కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Women's Engineering College)లో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ గురువారం తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐన బ్రైట్లిన్ మేనేజ్మెంట్ సొల్యూషన్(Technology company Brightlin Management Solutions) ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.
బ్రైట్లిన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ బి. సంపత్, మానవ వనరుల అధికారి కే. భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక లలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి నులు 29 మంది విద్యార్థి నులు ఎంపిక అయ్యారు. ఎంపిక అయిన వారికి విద్యార్థి నులకు వార్షిక వేతనం 3,00,000/- రూపాయలు ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు కే. భరత్ మరియు మేనేజర్ బి. సంపత్ తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు .ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు.