మోతె లో ఘనంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
స్వేరోస్, ఆర్ఎస్పీ సైన్యం ఆధ్వర్యంలో కేక్ కటింగ్.. పండ్ల పంపిణీ
మోతె, నవంబర్ 23 (విజయ క్రాంతి): జ్ఞాన యోధుడు, బహుజన చైతన్య స్ఫూర్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(Dr. R.S. Praveen Kumar) జన్మదిన వేడుకలను స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పిడమర్తి దశరథ ఆధ్వర్యంలో మోతె మండల కేంద్రంలో స్వేరోస్, ఆర్ఎస్పీ సైన్యం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు ప్రజలకు పండ్ల పంపిణీ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన గురుకుల విద్యా సంస్కరణలు,
పేద విద్యార్థుల అభ్యున్నతికి చేసిన కృషితో పాటు సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, విద్యా చైతన్యం పెంపొందించేందుకు అందించిన సేవలను ప్రజలకు వివరించారు. ఆయన ఆశయాలు, సంస్కరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సామాజిక మార్పు కోసం నిరంతరం కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మాజీ జిల్లా కోశాధికారి గట్టి గుండ్ల రాము, ఏర్పుల సాయికృష్ణ, ఆర్ఎస్పీ సైన్యం గురిజాల వెంకన్న, ధారమల్ల ఎలీషా, మాలోతు కోటి ,ఆర్ఎస్పీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.