జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
నేరేడుచర్ల, అక్టోబర్ 03(విజయ క్రాంతి): నేరేడుచర్లలో(Nereducherla) జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు(Janasena Party In-charge Sarikoppula Nageswara Rao) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections) సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హుజూర్‌నగర్ కో-ఆర్డినేటర్లు యడమ రాజేష్, పనుతుల జయరాం పాల్గొన్న సందర్బంగా వారు మాట్లాడుతూ.... రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు(Graduate MLC elections) సంబంధించి ఎన్నికల విధానం, ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గాడల శ్రీనివాసరావుకి మద్దతుగా ప్రతి జనసైనికుడు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.ఓటు హక్కుకు అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, ముఖ్యంగా యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ సరికొప్పుల విజయలక్ష్మి–నాగేశ్వరరావు, అందే శ్రీను, సైదులు యాదవ్, కొమ్మరాజు శ్రీను, హసన్మియా, సాయి చరణ్, నరేష్ కీసర, మధు, మట్టయ్య, గోపి, వంశీ, మణిబాబు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.