ఆపదలో అండగా.. బాధితులకు భరోసాగా.!
- అనారోగ్య బాధితులకు పరామర్శ.. మృతుడి కుటుంబానికి ఓదార్పు
- మోతె మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి పరామర్శ
మోతె, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి(Congress Party President Keesara Santhosh Reddy) ముందుకు సాగారు. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఇటీవల మృతిచెందిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చారు.అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సామ పెద్ద వెంకట్‌రెడ్డిని, శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న కుంట నారాయణరెడ్డి సతీమణి జయమ్మను ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఇటీవల మృతిచెందిన దోసపాటి రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొక్క వీరరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మనాగోటి శ్రీకాంత్, మాజీ ఉపసర్పంచ్ బొక్క యల్లారెడ్డి, బొడ్డు నర్సయ్య, వెలుగు వీరన్న, హనుమారెడ్డి, దోసపాటి చిరంజీవి, దోసపాటి ఉపేందర్ తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.