నేరేడుచర్ల మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం
చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన, వైస్‌చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee)కి నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. రాష్ట్ర మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఐదో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన, వైస్‌చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డిని నియమించింది. వీరితోపాటు 12 మంది సభ్యులు, జిల్లా మార్కెటింగ్ అధికారి, హుజూర్‌నగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌ను అధికారిక సభ్యులుగా నియమించారు.
మొత్తం 17 మందితో కమిటీ ఏర్పాటైంది.ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాలకవర్గం కొనసాగనుంది.రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం,వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేయడం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టడం నూతన పాలకవర్గం ముందున్న ప్రధాన బాధ్యతలు నూతన కమిటీ నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.