నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

01-11-2026 | 05:25pm

మఠంపల్లి నవంబర్ 01 (విజయక్రాంతి): మండలంలోని పాత దొనబండ తండా గ్రామ పంచాయతీలో అంగన్వాడీ భవనానికి ఆదివారం గ్రామ సర్పంచ్ బానోతు గుమ్మ మంద నాయక్(Sarpanch Banoth Gumma Manda Naik) చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో చిన్నారులకు మెరుగైన విద్య,పౌష్టికాహారం నాణ్యమైన అంగన్వాడీ సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషకరమని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాకారంతో పాత దొనబండ తండా గ్రామ పంచాయతీ ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్యా దుబ్ల నాయక్ వార్డు సభ్యులు భూక్యా కుమారి, వాలియా, బుజ్జి, సత్యవతి, లక్ష్మి, సిబ్బంది గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు