చందుపట్ల ఊర చెరువులో అక్రమ ఆక్రమణలకు చెక్

09-09-2026 | 10:14pm

కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.. అక్రమ బోరు మోటార్ల తొలగింపు

చివ్వెంల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చందుపట్ల గ్రామంలోని ఊర చెరువులో జరిగిన అక్రమ ఆక్రమణలను అధికారులు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ ఏఈ మమత, ఆర్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో చెరువు పరిధిలోని భూములను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఊర చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్లను అధికారులు గుర్తించి తొలగించారు. చెరువు భూములను ఆక్రమించడంపై అధికారులు చర్యలు చేపట్టడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు