కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక
అధ్యక్షుడిగా పెద్ది అంజయ్య
కోదాడ నవంబర్ 06 (విజయక్రాంతి) : కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్(Kodad Lorry Owners Association) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్లో సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెద్ది అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా దొంగరి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా విలాస కవి నరసరాజు, కోశాధికారిగా షేక్ జానీ బాబా, ఉపాధ్యక్షులుగా పల్లా ప్రభాకర్ రెడ్డి, గంజి జగన్, సహాయ కార్యదర్శులుగా చెవుల వీరబాబు, బజారు సురేష్ లతో పాటు కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడు పెద్ది అంజయ్య మాట్లాడుతూ లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా నూతన కమిటీకి పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనగాల నాగేశ్వరరావు, ఆవుల రామారావు పైడిమర్రి వెంకటనారాయణ, గుండపునేని నాగేశ్వరరావు, తునం కృష్ణ, యలగందుల నరసయ్య, తోట శ్రీను, అల్తాఫ్ హుస్సేన్, ఓరుగంటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.