గోపతండాలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ బిక్కు

23-09-2026 | 08:24pm

మోతె, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతండ గ్రామంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) పంపిణీ చేశారు. గోపతండ గ్రామపంచాయతీకి మొత్తం 661 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు నాయక్, డీలర్ సీతారాములు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 

అనంతరం సర్పంచ్ బిక్కు నాయక్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, గ్రామపంచాయతీ సర్పంచ్‌కు . డీలర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు