గణపయ్యకు 108 రకాల నైవేద్యాల సమర్పణ
తాండూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని శ్రీ శక్తి పంచాయతన క్షేత్రం (Sri Vasavi Mata Temple)లో కొలువైన గణనాథుని కృప కోసం భక్తులు 108 రకాల నైవేద్యాలను మంగళవారం సమర్పించారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కొలువుదీరిన మట్టి మహాగణపతికి మహిళలు తమ ఇళ్లలో భక్తిశ్రద్ధలతో ఇష్టమైన పిండి వంటలు, వివిధ రకాల వంటలతో తయారు చేసిన 108 రకాల ప్రసాదాలను తీసుకువచ్చి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించారు.
అనంతరం మహిళలు భక్తి గీతాలు, భజనలను ఆలపిస్తూ గణనాథుని స్మరణలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు(Committee members) మాట్లాడుతూ భక్తితో సమర్పించిన నైవేద్యం కేవలం ప్రసాదం కాదని.. భక్తుల మనసులను కలిపే ఆధ్యాత్మిక వారధి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్య ఆశీస్సులు పొందారు