డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

29-10-2026 | 03:53pm

శ్రీరంగాపూర్ తహసీల్దార్ వరలక్ష్మి పిలుపు

శ్రీరంగాపూర్, అక్టోబర్ 29:డిగ్రీ అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో(MLC Voter List) తమ పేరును నమోదు చేసుకోవాలని శ్రీరంగాపూర్ తహసీల్దార్(Srirangapur Tahsildar) వరలక్ష్మి పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు పొందాలని ఆమె సూచించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హత కలిగిన వారు నిర్ణీత ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో లేదా నేరుగా శ్రీరంగాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొన్నారు.

మండల పరిధిలోని డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకొని ఓటరుగా నమోదు కావాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని తహసీల్దార్ వరలక్ష్మి సూచించారు.

మరిన్ని వార్తలు