మామునూర్ పోలీస్ స్టేషన్‌ తనిఖీ చేసిన ఈస్ట్ జోన్ డిసీపీ

23-11-2026 | 09:55pm

వరంగల్:  వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate) ఈస్ట్ జోన్ డిసీపీ అంకిత్ కుమార్ సోమవారం మామునూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు డిసీపీకి పూల మొక్క అందించి స్వాగతం పలకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలను డిసీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డిసీపీ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ గౌరవ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచనలను పాటిస్తూ విదులు నిర్వహించాలని అధికారులను, సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మామునూర్ ఏసీపీ వెంకటేష్ , మామునూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ.లు నిసార్ పాషా, హరిశంకర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు