భద్రాద్రి జిల్లాకు నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీల కేటాయింపు...

23-11-2026 | 09:01pm

కొత్తగూడెం నవంబర్ 23 విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్(Telangana State Police Director General) ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా నలుగురు, ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ తెలిపారు.

ఈ మేరకు మామిళ్ళ ఓంకార్ యాదవ్, సాయికుమార్ కన్నెకంటి, వినోద్ కుమార్ ఎట్టం, ఎం. సింధూజ నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు సోమవారం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ పరిధిలో నిర్దేశిత శిక్షణ కార్యక్రమం ప్రకారం జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణ పొందనున్నారు.

ఈ శిక్షణలో భాగంగా పోలీస్ శాఖ పనితీరు, క్షేత్రస్థాయి విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీస్ స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలపై ప్రాయోగిక అనుభవాన్ని పొందనున్నారు.

మరిన్ని వార్తలు