గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఈజీ హోమ్ ఫేస్ ప్యాక్
ముఖం కాంతివంతంగా కనిపించాలని చాలామంది రకరకాల బ్యూటీ టిప్స్(Beauty Tips) పాటిస్తుంటారు. అయితే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్(Face Pack)తో ముఖానికి మంచి గ్లో వస్తుంది.
ఫేస్ గ్లో కోసం.. ఇలా చేయండి
అర చెక్క టమాటాను తీసుకుని అందులో కొద్దిగా కాఫీ పౌడర్, టూత్‌పేస్ట్, అర చెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి. అవసరమైనంత నీటిని జోడించి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
ఈ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు Patch Test(ప్యాచ్ టెస్ట్) చేసుకోవడం మంచిది. చర్మంపై మంట, దురద లేదా ఎర్రదనం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే ఉపయోగించడం ఆపేయాలి. ప్రతి ఒక్కరి చర్మతత్వం భిన్నంగా ఉండటంతో స్కిన్ కేర్(Skin Care) విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం.