సకాలంలో పక్షవాతానికి చికిత్సతో ప్రాణాలు నిలుపొచ్చు

31-10-2026 | 05:00am
  1. వైకల్యాన్ని నివారించవచ్చు
  2. కామినేని ఆసుపత్రుల వైద్యులు
  3. ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా సూచనలు

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): పక్షవాతం(స్ట్రోక్) పట్ల ప్రజల్లో అవగాహన పెంచుకోవడంతో పాటు, దాని లక్షణాలను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయాన్ని, దీర్ఘకాలిక వైకల్యాన్ని తగ్గించవచ్చని కామినేని ఆసుపత్రుల(Kamineni Hospitals) న్యూరాలజీ నిపుణులు సూచించారు. ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా ప్రతి నిమిషం కీలకమే అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.2 కోట్ల మంది పక్షవాతం బారినపడుతున్నారని, ఇది మరణాలకు, దీర్ఘకాలిక వైకల్యా నికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉందని తెలిపారు. మెదడుకు రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు లేదా మెదడులోని రక్తనాళం చిట్లినప్పుడు పక్షవాతం సంభవిస్తుంది. అధి క రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగ డం, ధూమపానం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని గుండె సంబంధిత సమస్యలు పక్షవాతానికి ప్రధాన ముప్పు కారకాలు.

వీటిని అదుపులో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా పక్షవాతం వచ్చే ప్రమా దాన్ని తగ్గించవచ్చని వైద్యులు వివరించారు. కామినేని ఆసుపత్రుల న్యూరాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కమలేశ్ ఎం. చావ్డా మాట్లాడుతూ.. ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం, చూపులో మార్పులు రావడం, నడకలో స మతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే పక్షవాతంగా అనుమానించాలని తెలిపారు.

ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంట నే అత్యవసర వైద్యసేవలు పొందాలని సూ చించారు. సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం. లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ.. పక్షవాతం ముప్పును తగ్గించడంలో జీవనశైలి మార్పులు కీలకమని తెలిపారు. ఉప్పు అధికంగా తీసుకోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు వినియోగం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపు లో ఉంచుకోకపోవడం ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు. కన్సల్టెంట్ న్యూరాల జిస్ట్ డాక్టర్ నారెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడు తూ.. పక్షవాతం వచ్చిన తర్వాత ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు సూచించిన మందులను స్వయంగా ఆపివేయకూడదని హెచ్చరించారు.

ఒకసారి పక్షవాతం నుంచి కోలుకున్నప్పటికీ మరోసారి వచ్చే ప్రమా దం పూర్తిగా తొలగిపోదని తెలిపారు. వైద్యు ల సలహా లేకుండా మందులు నిలిపివేయ డం లేదా మోతాదును మార్చడం ప్రమాదకరమని పేర్కొన్నారు. కామినేని ఆసుపత్రుల్లో మెదడు సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్సకు 3 టెస్లా ఎంఆర్‌ఐ, 128 స్లైస్ సీటీ స్కానర్, వీడియో ఈఈజీ, న్యూరో నా విగేషన్ వ్యవస్థ, టివాటో జైస్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్, స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ వంటి అధునాతన సదుపాయాలు అందుబాటు లో ఉన్నాయని చెప్పారు. ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా ప్రజలు ప్రమాద కారకాలను నియంత్రించుకోవాలని, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సేవలు పొందాలనిపరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచించారు. 

మరిన్ని వార్తలు