స్ట్రోక్‌లో ఆలస్యం చేస్తే శాశ్వత వైకల్యం!

29-10-2026 | 05:00am

మెడికవర్ హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ హరి రాధాకృష్ణ 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం లేదా రక్తస్రావం కారణంగా వచ్చే స్ట్రోక్(Stroke)లో చికిత్స ఆలస్యమైతే శాశ్వత వైకల్యం(Permanent Disability) ఏర్పడే ప్రమాదం ఉందని డాక్టర్ హరి రాధాకృష్ణ (సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్) హెచ్చరించారు.

ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, గుండె సంబంధిత సమస్యలు స్ట్రోక్ ముప్పును పెంచుతాయని తెలిపారు. చికిత్స అనంతరం ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీ థెరపీ ద్వారా రోగి కోలుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెం టనే వైద్య సహాయం పొందాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు