పర్వత వర్థిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయములో
శ్రీ దేవి శరనవరాత్రి ఉత్సవాల ప్రారంభం.....
బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు.....
యాదగిరిగుట్ట, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy) అనుబంధ ఆలయం అయినా శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం బాలా త్రిపుర సుందరిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. నేటి నుండి ఈనెల 20 వరకు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయంలో ఉదయం విఘ్నేశ్వర పూజ, స్వస్తి వాచనము పంచగవ్యప్రాశన, అఖండ దీపారాధన, అంకురారోపణము, మండపారాధన, కలశ స్థాపన శ్రీదేవీపూజ, బాలాత్రిపుర సుందరీ దేవి మూలమంత్ర జప, సప్తశతీ, లలితా పారాయణములను పండితులు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలను నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.