సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టరేట్ ఏఓకు బీజేపీ నాయకుల వినతిపత్రం
ఆలేరు,(విజయక్రాంతి): సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day)గా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి లభించిందన్నారు.
విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్‌గుప్తా, కదూరి అచ్చయ్య, జిల్లా కార్యదర్శి మేడి కోటేష్, రత్నపురం బలరాం, డీఎల్‌ఎన్ గౌడ్, మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.