ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమిని సర్వే చేయాలి
11-09-2026 | 06:13pm
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government junior college) భూమిని సర్వే చేయాలని గ్రామస్తులు కోరారు.ఈ సందర్భంగా శుక్రవారం గ్రామస్తులు తహాసిల్దార్ శ్వేతకు వినతిపత్రం అందించారు. ఈ విషయమై వారు మాట్లాడుతూ... మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఐదు ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని, ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం సర్వే చేయించి సరిహద్దులు పాతించాలని వారు కోరారు. ఈ విషయమై తహసిల్దార్ వెంటనే స్పందించారని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల భూమిని సర్వే చేయించి హద్దులు పాతిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.